పులి లేగదూడపై విరుచుకు పడింది. ఈ దాడిలో లేగదూడ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం మాచుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
వరంగల్: పులి లేగదూడపై విరుచుకు పడింది. ఈ దాడిలో లేగదూడ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం మాచుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మెట్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయబావి వద్ద లేగదూడ చనిపోయి ఉంది. పులి లేగదూడను చంపి తినింది. చుట్టుపక్కల ఉన్న పాదాల గుర్తులను బట్టి పులి దాడిచేసి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు.