‘టీఐడీసీ’లో నాయిని ఓటమి | TIDC Nai defeat | Sakshi
Sakshi News home page

‘టీఐడీసీ’లో నాయిని ఓటమి

Nov 20 2014 4:36 AM | Updated on Oct 20 2018 5:03 PM

మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని టీఐడీసీ ఇండియా.

జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని టీఐడీసీ ఇండియా పరిశ్రమలో బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ అభ్యర్థి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములు విజయం సాధించారు. పరిశ్రమలో మొత్తం ఓట్లు 171 ఉండగా, 168 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 100 ఓట్లు రాములుకు రాగా, నాయినికి 68 ఓట్లు పోలయ్యాయి. ఫలితం వెలువడగానే సీఐటీయూ నాయకులు, పరిశ్రమ కార్మికులు పారిశ్రామిక వాడలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement