విద్యుత్‌షాక్‌తో ముగ్గురు రైతుల మృతి | three farmers killed by short circuite | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

Aug 30 2014 11:59 PM | Updated on Sep 28 2018 3:39 PM

కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

సాక్షి నెట్‌వర్క్: కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి పరిధి శంషాబాద్‌కు చెందిన మెరుగు మల్లయ్య(55) వరికి నీరు పెట్టేందుకు శనివారం ఉదయం వెళ్లాడు. మోటార్ ఆన్ చేసిన అనంతరం క్రేన్ వైర్‌ను పట్టుకోగా కరెంట్ సరఫరా అయి షాక్‌తో మృతి చెం దాడు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ శివారు బోడమంచ్యా తండాకు చెందిన దారావత్ మల్సూర్, కంసాలి దంపతుల కుమారుడు హుస్సేన్(23) ఇనుప బురదగొర్రును భుజంపై మోసుకుంటూ వెళుతుండగా పొలంలో కిందకు వేలాడుతున్న 11 కే వీ విద్యుత్‌తీగ తాకింది.

 

విద్యుదాఘాతానికి గురై హుస్సేన్  చనిపోయాడు. ఇతడికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. కురవి మండలం బందంకొమ్ము తండాకు చెందిన బానోత్ హచ్చా(56) వ్యవసాయ బావి వద్ద ఉన్న బోర్‌మోటార్‌కు ప్లాస్టిక్ కవర్‌ను కప్పుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement