రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు : సీఎం కేసీఆర్‌

Telangana Budget Session CM KCR Speech On Coronavirus - Sakshi

రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? : కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ర్టానికి కరోనా వైరస్‌ రాదు.. రానివ్వం కూడా అని సీఎం తేల్చిచెప్పారు. ఈ వైరస్‌ ఇక్కడ పుట్టినది కాదు, ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చిందన్నారు. ఈ 31 మంది కూడా దుబాయ్‌, ఇటలీ లాంటి ఇతర దేశాలకు పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. (సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు)

మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదు అని సీఎం సభలో చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్‌ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్‌ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఎవరూ బయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top