ఉప్పల్‌లో యూఎస్‌ఏ విద్యార్థుల పర్యటన | Students Uppal Tour | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో యూఎస్‌ఏ విద్యార్థుల పర్యటన

Jul 21 2018 11:54 AM | Updated on Aug 24 2018 8:18 PM

Students Uppal Tour - Sakshi

కమలాపూర్‌(హుజూరాబాద్‌) వరంగల్‌ : కమలాపూర్‌ మండలంలో యూఎస్‌ఏ విద్యార్థుల పర్యటన రెండో రోజూ కొనసాగింది. వారు రోజంతా పాఠశాల విద్యార్థులతో ఉత్సాహంగా గడిపారు. మర్రిపల్లిగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయురాలు పుల్ల గ్లోరీరాణి చొరవతో హెల్ప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, యూఎస్‌ఏలో స్థిరపడ్డ ఉప్పల్‌ గ్రామానికి చెందిన పుల్ల కోనీ ఆధ్వర్యంలో మండలంలోని ఉప్పల్‌ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం యూఎస్‌ఏలోని యూటా రాష్ట్రంలోని బీవైయూ విశ్వవిద్యాలయానికి చెందిన 12 మంది విద్యార్థులు సందర్శించారు.

విద్య, వైజ్ఞానిక, సామాజిక, క్రీడలు, గ్రంథాలయం, ల్యాబోరేటరీల నిర్వహణ, పాఠశాల నిర్వహణ తీరు, విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా విద్యా బోధన, విద్యార్థుల నైపుణ్యతలను పరిశీలించి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులతో కలిసి పలు ఆటలు ఆడించి దేశీయ క్రీడలతోపాటు కొత్త క్రీడలు నేర్పించారు. ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు వివరించారు.

సర్పంచ్‌ దేశిని శ్రీనివాస్‌ మాట్లాడుతూ యూఎస్‌ఏ విద్యార్థులు సూచనలను పాటించాలన్నారు. వారు అందించిన నైపుణ్య, శిక్షణ అంశాలను ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామని హెచ్‌ఎం భాగ్యవతి తెలిపారు. యూఎస్‌ఏ విద్యార్థులు మెలోడి, బ్రాస్కెన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement