మీడియా మానిటరింగ్‌కు రాష్ట్రస్థాయి కమిటీ

State level committee for media monitoring - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పత్రి కలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చే రోజువారీ వార్తలు, ప్రకటనల సమీక్ష, చెల్లింపు వార్తలను గుర్తించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రస్థాయి కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్‌కుమార్, సభ్యులుగా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ అదనపు డీజీ టీవీకే రెడ్డి, ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్‌ స్టీవెన్‌సన్, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంఏ మజీద్‌తోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నియ మించే పరిశీలకుడు ఉండనున్నారు.

కమిటీ సభ్యకార్యదర్శిగా అదనపు రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి జ్యోతి బుద్ధప్రసాద్‌ నియమితులయ్యా రు. ఈ మేరకు సీఈవో రజత్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి/రిటర్నింగ్‌ అధికారి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు జారీ చేసే ప్రచార ప్రకటనలను పరిశీలించి ఈ కమిటీలు ఆమోదం తెలపనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top