రైతుల రుణాలను మాఫీ చేయాలి | Should be farmers forgive debts | Sakshi
Sakshi News home page

రైతుల రుణాలను మాఫీ చేయాలి

Jul 16 2014 4:51 AM | Updated on Sep 2 2017 10:20 AM

తెలంగాణ రాష్ట్రం లో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలను వెంటనే మాఫీ చేస్తూ జీఓను విడుదల చేయాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర రావు డిమాండ్ చేశారు.

 నందిపేట : తెలంగాణ రాష్ట్రం లో రైతులు తీసుకున్న  లక్ష రూపాయల లోపు రుణాలను వెంటనే మాఫీ చేస్తూ జీఓను  విడుదల చేయాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం  అధ్యక్షుడు విశ్వేశ్వర రావు డిమాండ్ చేశారు. మంగళవారం మం డల కేంద్రంలో తెలంగాణ రా ష్ట్ర రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సమావేశానికి హాజరైన  విశ్వేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కిన తర్వాత రిజర్వ్ బ్యాంకును సాకుగా చూపి తప్పించుకోవాలని చూ స్తోందని విమర్శించారు.

 గతేడాది ఆగస్టులో నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సి డీ కింద నిధులు  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని బోధన్ పట్టణ శివారులో గల శ్రీబాలాజీ రైస్‌మి ల్లు నుంచి దుమ్ము,ధూళీ వెలువడడం వల్ల చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు దెబ్బతింటున్నాయన్నారు.  తద్వా రా చిన్న, సన్నకారు రైతు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు పశ్య పద్మ, కంజర భూమయ్య, శేఖర్‌బాబు, శంకర్, షేక్ బాబు, సుధాకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement