దేశభక్తి నేపథ్యంలో ‘అభినవ్‌’ | Abhinav Movie Latest Update | Sakshi
Sakshi News home page

దేశభక్తి నేపథ్యంలో ‘అభినవ్‌’

Nov 16 2024 10:45 AM | Updated on Nov 16 2024 10:45 AM

Abhinav Movie Latest Update

‘ఆదిత్య, విక్కీస్‌ డ్రీమ్, డాక్టర్‌ గౌతమ్‌’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్‌ గౌడ్‌ రూపొందించిన మరో బాలల చిత్రం ‘అభినవ్‌’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్‌ గగన్‌ , గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సమర్పణలో సంతోష్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. 

శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భీమగాని సుధాకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎన్‌సీసీ, స్కౌట్స్, యోగా, ధ్యానం నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement