‘మహబూబ్‌నగర్, సిద్దిపేటలో శిల్పారామాలు’

Shilparamam Now In Mahabubnagar And Siddipet  - Sakshi

మాదాపూర్‌: నగరంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న శిల్పారామాలను మహబూబ్‌నగర్, సిద్దిపేటలో త్వరలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. అనంతరం దశల వారీగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రా ల్లోనూ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్‌ మేళాను మంత్రి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరవాసులు సేద తీరేందు కు, ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు.

పీఆర్వోల పాత్ర కీలకం: శ్రీనివాస్‌గౌడ్‌ 
సనత్‌నగర్‌: సమాజంలో ప్రజా సంబంధాల అధికారుల ( పీఆర్వో) పాత్ర కీలకమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మూడ్రోజులుగా బేగంపేటలో ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ‘పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ముగింపు సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మంత్రి చేతులమీదుగా అవార్డులు 
పీఆర్‌ఎస్‌ఐ చాప్టర్‌ అవార్డులను శ్రీనివాస్‌గౌ డ్‌ చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ చాప్టర్‌ చైర్మన్‌ అవార్డును హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ పి.వేణుగోపాల్‌రెడ్డి, జైపూర్‌ చాప్టర్‌ చైర్మన్‌ రవిశంకర్‌ శర్మ అందుకున్నారు. బెస్ట్‌ ఎమర్జింగ్‌ చాప్టర్‌గా తిరుపతి చాప్టర్‌ జాతీయ అవార్డు పొందింది. ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించిన కోల్‌కతా, గువాహటి, భోపాల్, అహ్మదాబాద్‌ చాప్టర్‌లకు అవార్డులు దక్కాయి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top