సేవకు సెల్యూట్‌

Shekhar Maraveni CRPF Sub Inspector White Valantire Social Service - Sakshi

వైట్‌ వలంటీర్స్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు  

5 ప్రభుత్వ పాఠశాలల  దత్తత

నిత్యం పాల సరఫరా, ప్రతి ఏటా దుస్తుల పంపిణీ 

వృద్ధులు, అనాథలు, వికలాంగులకు చేయూత

సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌ సేవా తత్పరత

 అల్వాల్‌: అటు దేశ సేవలో.. ఇటు సామాజిక సేవలో తరిస్తున్నారు వైట్‌ వలంటీర్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు శేఖర్‌ మారవేణి. జమ్మూ కశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శేఖర్‌.. ఎంతో మంది విద్యార్థులను ఆదుకుంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది మార్చిలో వైట్‌ వలంటీర్స్‌ సంస్థ ఏర్పాటు చేసి సిరిసిల్లలో మూడు ప్రభుత్వ పాఠశాలలు, పిల్లాయిపల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని పాలామృతం పేరుతో ప్రతిరోజూ విద్యార్థులకు పాలను అందిస్తున్నారు. ప్రతి ఏటావిద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, అనాథలు, వికలాంగుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు.  

ఒక్కరి ఆలోచన 200 మందికి స్ఫూర్తి
మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా నాగరానికి చెందిన శేఖర్‌ తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతుండటం, సరైన దుస్తులు లేకపోవడంతో మధ్యలోనే బడి మానేయడం వంటి సమస్యలను గమనించారు. దీంతో తాను భవిషత్తులో కొంత మేరకైనా సహాయం చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నారు. 2012లో సీఆర్‌ఫీఎఫ్‌లో ఉద్యోగం వచ్చాక ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రక్షణతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటినుంచి సామాజిక సేవ చేయాలనే సంకల్పం రెట్టింపయ్యింది. ఏడాది క్రితం 8 మందితో వైట్‌ వలంటీర్స్‌ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఇది 200 మంది ప్రతినిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తోంది.  

బాక్స్‌లు ఏర్పాటు చేసి..
ఈసీఐఎల్, మల్కాజిగిరి చౌరస్తాల్లో బాక్స్‌లు ఏర్పాటు చేసి దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను సేకరిస్తూ విద్యార్థులకు, వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. శేఖర్‌ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయన భార్య లత, సంస్థ ప్రతినిధులు యోగధాత్రి, ప్రభాకర్, శ్రావణి, దీపాంజలి, విక్రాంత్, రాజు, సతీష్‌లతో పాటు ఆరు కళాశాలలకు చెందిన 200 ప్రతినిధులు సేవాతత్పరతను చాటుతున్నారు.   

హ్యాపీ.. సెల్ఫీ
జూబ్లీహిల్స్‌: ప్రముఖ సినీనటి తమన్నా మంగళవారం బంజారాహిల్స్‌ జీవీకే వన్‌ మాల్‌లోని యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌ స్టోర్‌లో సందడి చేశారు. కొత్త ఎస్‌ఎస్‌–19 సమ్మర్‌ కలెక్షన్‌ను ఆమె ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు తమ శక్తిసామర్థ్యాలను గుర్తించి ముందుకెళితే విజయం తథ్యమన్నారు. చిన్నప్పటినుంచి తనకు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ అంటే ఎంతో ఇష్టమన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top