షాద్‌నగర్ జంట హత్యల కేసు విచారణ వాయిదా | shadnagar double murder case | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్ జంట హత్యల కేసు విచారణ వాయిదా

Jan 30 2015 2:48 AM | Updated on Sep 2 2017 8:29 PM

షాద్‌నగర్ జంట హత్యల కేసు విచార ణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: షాద్‌నగర్ జంట హత్యల కేసు విచార ణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ బస్టాండ్‌లో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల హత్యోదంతంలో నిందితుడు, టీడీపీకి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి దిగువ కోర్టు 2004లో విధించిన శిక్షను 2006లో హైకోర్టు కొట్టివేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ 2008లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ తాజాగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రాగా దీన్ని విచారించేందుకు ధర్మాసనం నిరాకరించడంతో ఈ కేసు మరో ధర్మాసనం ముందుకు వెళ్లనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement