విపక్షాల నిరసనలు, నినాదాలతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : విపక్షాల నిరసనలు, నినాదాలతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణలో మాలలు, మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు హరీష్ రావు మాట్లాడుతూ జాతీయ గీతాన్ని అవమానించిన టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన...స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. సభను అడ్డుకునేందుకే టీడీపీ సభ్యులు యత్నిస్తున్నారని హరీష్ రావు అన్నారు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ ...ఆందోళన చేస్తున్న సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో హరీష్ రావు ఆందోళన చేస్తున్న సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు.