‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’ | Repost Mortem Completed To Disha Accusers Dead Bodies In Gandhi Hospital | Sakshi
Sakshi News home page

‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’

Dec 23 2019 3:12 PM | Updated on Dec 23 2019 3:29 PM

Repost Mortem Completed To Disha Accusers Dead Bodies In Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుమారు నాలుగు గంటలకు పైగా రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు తయారు చేసిన నేటి పోస్టుమార్టం నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. మరికాసేపట్లో మృతదేహాలను తరలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే గాంధీ వైద్యులు రెండు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఇక రెండు రోజుల్లో రీ పోస్టుమార్టం నివేదికను సీల్ట్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్టార్‌కు అప్పగించనున్నటట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement