టీవీ9 వద్ద ఉద్రిక్తత, సాక్షి ప్రతినిధిపై దౌర్జన్యం

Ravi prakash supports Rude Behaviour With sakshi reporter at tv9 office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’  మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్‌ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ’సాక్షి’  రిపోర్టరుతో రవిప్రకాశ్‌ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. కెమెరాను లాక్కునేకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానల్స్‌ ప్రతినిధులు ఉన్నప్పటికీ...కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే వాళ్లు టార్గెట్‌ చేశారు. రోడ్డు అడ్డంగా ఉన్నారని, తమకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ దౌర్జన్యానికి దిగారు. లైవ్‌ కవరేజ్‌ చేస్తున్న డీఎస్‌ఎన్జీ వాహనం వైర్లు పీకేశారు. 

చదవండి: (టీవీ9లో రెండోరోజు పోలీసుల సోదాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top