మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా అయిన సాంబారులో ఎలుక వచ్చింది.
పటాన్‌చెరు: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా అయిన సాంబారులో ఎలుక వచ్చింది. ఈ సంఘటన మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. అక్షయపాత్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్షయపాత్ర ప్రతినిధి రాజహంసదాస వివరణ ఇస్తూ.. సాంబారులో ఎలుక ఎలా పడిందో ఇప్పుడే చెప్పలేమన్నారు.