చిరుద్యోగులకు వేతనాలు పెంచడం హర్షణీయం : సీఐటీయూ

CITU Chief Secretary MA Gafur Press Meet In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌(సీఐటీయూ) నాయకులు మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచటం చాలా సంతోషమన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగస్తులకు వేయి రూపాయలు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం పెంచిన వేతనాలను రాష్ట్ర ఖజనాతో కలపకుండా నేరుగా వేతనాలతో జత చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేయాలని గఫూర్‌ డిమాండ్‌ చేశారు. కార్మిక శాఖను డీటీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ధార్మిక సంస్థలకు ఇవ్వటం సరి కాదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top