రాజీవ్ ఆశయాల కోసం ఉద్యమించాలి | Rajiv agitating for ideals | Sakshi
Sakshi News home page

రాజీవ్ ఆశయాల కోసం ఉద్యమించాలి

Jul 16 2016 2:11 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాజీవ్ ఆశయాల కోసం ఉద్యమించాలి - Sakshi

రాజీవ్ ఆశయాల కోసం ఉద్యమించాలి

భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాల సాధన కోసం యువజన కాంగ్రెస్ ముందుండి పోరాటం చేయాలని డీసీసీ

వరంగల్ : భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాల సాధన కోసం యువజన కాంగ్రెస్ ముందుండి పోరాటం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అ న్నారు. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో శుక్రవారం యుజన కాంగ్రెస్ విభాగం అధ్వర్యం లో రాజీవ్‌గాంధీ 25వ వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకొని ‘హమ్ మే హై రాజీవ్’ అనే ఒక రోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారుుని మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చిన అనంతరమే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.


యువజన కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి  రోహిత్‌సింగ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్య క్షుడు కట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ నాల శ్రీహరి, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఈవీ. శ్రీనివాసరావు, నాయకులు లింగాజీ,  రవీంద ర్, ప్రదీప్,  శ్రీనివాస్‌రెడ్డి, రాంకీ, రాహూల్, ఫిరోజ్, విక్రం, సంపత్, ఫర్హస్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement