పది రూపాయల నాణాలతో తంటాలు | public panic while small vendors refusing 10 rupee coins | Sakshi
Sakshi News home page

పది రూపాయల నాణాలతో తంటాలు

Apr 22 2017 10:19 PM | Updated on Oct 8 2018 5:07 PM

‘రూ.పది నాణేలపై అసత్య ప్రచారం ఎల్లలు దాటింది. కొంత మంది స్వార్థం కారణంగా సాక్షాత్తు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ముద్రించిన పది రూ.నాణేలను తీసుకునేందుకు చిల్లర వ్యాపారులు విముఖత చూపుతున్నారు.

మరికల్ ‌: ‘రూ.పది నాణేలపై అసత్య ప్రచారం ఎల్లలు దాటింది. కొంత మంది స్వార్థం కారణంగా సాక్షాత్తు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ముద్రించిన పది రూ.నాణేలను తీసుకునేందుకు చిల్లర వ్యాపారులు విముఖత చూపుతున్నారు. మరో వైపు ఇవి చెల్లుబాటు అవుతాయంటూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటిస్తున్నా.. వ్యాపారులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కూలీలు, సామాన్య ప్రజల వద్ద ఉన్న నాణేలు ఎటూ కాకుండాపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.’

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్యను అధిగమించేందుకు రిజర్వు బ్యాంకు రూ.పది నోట్ల స్థానంలో పెద్ద ఎత్తున రూ.పది నాణేలను విడుదల చేసింది. ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. సాధారణంగా చిన్న, దుకాణాలకు వద్దకు ఎక్కువగా ఒక రూపాయి నుంచి రూ.పది నోట్లు, నాణేలు మాత్రమే వస్తుంటాయి. ఈ క్రమంలో చిరు వ్యాపారులు తమ వద్దకు వచ్చిన రూ.పది నాణేలను హోల్‌సేల్‌ వ్యాపారులకు ఇస్తుంటే వాటిని తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. నాణేలు లెక్కగట్టడం తమకు ఇబ్బందిగా ఉంటుందంటూ తిప్పి పంపుతున్నారు. మరో వైపు హోల్‌సేల్‌ వ్యాపారులు తమ వద్దకు వచ్చిన పది నాణేలను బ్యాంకులో ఇవ్వబోతే కొందరు బ్యాంకర్లు వాటిని లెక్కగట్టడంలో ఎదురవుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.పది నాణేలు చెల్లవనే ఓ అసత్య ప్రచారం పుట్టించారు.

రూ.5 వేలు జమ చేశాను..
రూ.10 నాణేలు చెల్లవనే ఒక అసత్య ప్రచారం కారణంగా తమ వద్దకు వచ్చే వినియోగదారుల నుంచి తీసుకున్న రూ.పది నాణేలు ఇపటి వరకు రూ.5 వేలు జమ చేశాను. తిరిగి తాము ఇవ్వడానికి వెళ్తే అటు హోల్‌సేల్‌ వ్యాపారులు, ఇటు బ్యాంకు అధికారులు విముఖత చూపాడంతో చిరు వ్యాపారులం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- వీరన్న, కూల్‌డ్రింక్‌ వ్యాపారీ, మరికల్‌

రూ.పది నాణేలు చెల్లుబాటు అవుతాయి
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన రూ.పది నాణేల విషయంలో ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మోదు. మార్కెట్లో చెలామణిలో ఉన్న నాణేలను వ్యాపారులు, ప్రజల తీసుకుంటేనే చెలామణి అవుతాయి. ఎవరో సృష్టించిన పుకార్లను నమ్మకుండా రూ.పది నాణేలను తీసుకొని సహకరించాలి.
- భానుప్రకాష్, ఎస్‌బీహెచ్‌ మేనేజర్‌, మరికల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement