విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం | power cuts for farmers Wrath | Sakshi
Sakshi News home page

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం

Jul 27 2014 1:18 AM | Updated on Jun 4 2019 5:04 PM

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం - Sakshi

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం

విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని కుడకుడ రైతులు శనివారం స్థానిక సబ్‌స్టేషన్ ముట్టడించారు. మూడు రోజులుగా సబ్‌స్టేషన్ పరిధిలోని ఐలాపురం,

కుడకుడ(చివ్వెంల) : విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని కుడకుడ రైతులు శనివారం స్థానిక సబ్‌స్టేషన్ ముట్టడించారు. మూడు రోజులుగా సబ్‌స్టేషన్ పరిధిలోని ఐలాపురం, గాయంవారిగూడెం, రోళ్లబండ తండాగ్రామాలకు కరెంటు సరఫరా లేదు. దీంతో పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు సరఫరా విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మూడు గ్రామాల రైతులు కుడకుడ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు.
 
 ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరా విషయమై స్థానిక లైన్‌మన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించా రు. పొలాలు ఎండిపోవడంతోపాటు గ్రామాల్లో తాగునీటి కోసం నరకయాతన పడాల్సి వస్తుందన్నారు. రాత్రివేళలో చీకటిలో మగ్గుతున్నామన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కె.నర్సింహరావు సంఘటనస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ట్రాన్స్‌కో ఎఈ శ్రీనివాస్‌రావును పిలిపించాలని డిమాండ్ చేయ గా, ఎస్‌ఐ వెంటనే ఏఈని పిలిపించారు. అనంతరం రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఈకి అందించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో 200మంది రైతులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement