శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్‌ | police picket in satavahana university | Sakshi
Sakshi News home page

శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్‌

Dec 26 2017 12:02 PM | Updated on Dec 26 2017 12:11 PM

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. రేపు జరగాల్సిన ఎంబీఏ థర్డ్‌ సెమిస్టర్‌ పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఎదుట మను స్మృతి ప్రతులను పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, విద్యుత్‌ మరమ్మతుల దృష్ట్యా హాస్టల్‌కు సెలవు ప్రకటించామని, వర్సిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని రిజిస్ట్రార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement