పోలీసుల అదుపులో 50 మంది అనుమానితులు | police arrests 50 suspects in cordon search | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 50 మంది అనుమానితులు

Apr 18 2015 6:24 AM | Updated on Sep 3 2017 12:28 AM

మోతీ ధర్వాజలోని ఐదు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: మోతీ ధర్వాజలోని ఐదు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో డీసీపీతో పాటు, 400మంది పోలీసులు పాల్గొన్నారు. సెర్చ్ లో భాగంగా పోలీసులు ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 44 వాహనాలను స్వాధీనం చేసుకొని, పలువురి పై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement