కవితల మహ్మద్‌ రఫీ!

Poetry Writer Mohammed Rafi Special Story - Sakshi

మతం ముస్లిం.. అభిమతం తెలుగు కవిత్వం

సమాజం మార్పుకోరే కవితలు

డాక్యుమెంటరీ ఫిలిం కోసం ప్రయత్నాలు

తుంకిమెట్ల యువకుడి ఘనత

బొంరాస్‌పేట: అమ్మ ప్రేమ నిరంతరంఆకాశంలో మెరుపు అమ్మ కోసం..ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోలేక‘పిచ్చి’తనంతో బలవంతపు మరణాలు..అభంశుభం తెలియని బాలికలపైపైశాచిక దాడులు కసాయి సాక్షాలు..చంకన పిల్ల వయస్సులో ఉన్న చిన్నారులుకీచక, నీచ బుద్ధిహీనులు అమానవీయ మరకలు..కన్నవారికి శోకాలు.. సమాజానికి కలంకాలు భావితరాలకు ఇవేనా గుణపాఠాలుబంగారు భవితకు ఎవరువేయాలి బాటలు?

ఈ కవితలు బడికి దూరమై చికెన్‌సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ ముస్లిం యువకుడి కలం నుంచి జాలువారుతున్న తెలుగు కవితా కుసుమాల మాల. పరిగి మండలం గుముడాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్‌రఫీ పదో తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పదో తరగతివరకు చదివి మానేశాడు. కుటుంబ పోషణకు మండల పరిధిలోని తుంకిమెట్లలో ఐదేళ్లుగా చికెన్‌ సెంటర్‌ నడుపుతున్నారు.

సందేశాత్మక కవితలతో..
చికెన్‌ సెంటర్‌లో గిరాకీ లేనప్పుడు కాలక్షేపం కోసం కవితలు రాయడం రఫీకి హాబీగా మారింది. మనసుకు తోచినట్లు అంశాలను ఎంచుకొని అలవోకగా ప్రేమ, సందేశాత్మక కవితలు రాయడం కొనసాగిస్తున్నారు.

‘నీవు నవ్వితే చాలునెలవంక సిగ్గుపడుతది.
నీనడక చూసిహంస అసూయ పడుతది.
నడుము నాట్యంతోనెమలి పురి పూరుగుడిసైతది.
అంటూ అలవోకగా కవితలు అల్లడంలో రఫీ అందెవేసిన చెయ్యి. హిందీ ప్రముఖ గాయకుడు మహ్మద్‌రఫీ, బాలుపాడిన పాటలంటే ఈ కవితల రఫీ చెవికోసుకుంటాడు. చిన్ననాటి నుంచి కవితల పట్ల ఉన్న ఆసక్తితో సునాయసంగా, సహజంగా రాయాలేగాని కృత్రిమ కవితలు రాయలేనని చెబుతున్నాడు రఫీ.

షార్ట్‌ ఫిలిం తీయాలనుకున్నా
నా కవితలు చదివినవారు విన్నవారు చాలా బాగున్నాయని అంటున్నారు. పుస్తక రూపంలో, ఫొటో ఆల్బం చేయించాను. నాకవితలతో ఏఒక్కరు మారినా నాకు సంతృప్తి మిగిలిస్తుంది. సోషల్‌ మీడియాలో సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ చేయాలి ఉంది. త్వరలో షార్ట్‌ ఫిలిం తీసే ప్రయత్నాలు చేస్తున్నా. నేనే కథ రాశాను.  షూటింగ్‌కు సిద్ధంగా ఉంది.– మహ్మద్‌రఫీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top