రోడ్లకు అడ్డంగా కట్టేస్తున్నారు..! | Petition Filed In Hyderabad High Court On Illegal Temples Across Roads | Sakshi
Sakshi News home page

Oct 11 2018 5:43 PM | Updated on Jul 12 2019 6:06 PM

Petition Filed In Hyderabad High Court On Illegal Temples Across Roads - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్ధనా మందిరాలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రార్థనా మందిరాలతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ మామిడి వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమంగా నిర్మించిన ప్రార్ధనా మందిరాలు కొందరికి  వ్యాపార కేంద్రాలుగా మారాయనీ, ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు.

అనుమతిలేని ఆలయాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలిచ్చిందని వేణుమాదవ్‌ కోర్టుకు విన్నవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలో 2010లో ఈ విషయమై పాలసీ తయారీకి, ఇంప్లిమెంటేషన్‌కు ప్రభుత్వం 262, 263 జీవోలు సైతం తెచ్చిందని పిటిషనర్‌ అన్నారు. అనుమతులు లేని ప్రార్థనాలయాల తొలగింపుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. 

తొలగించాం..
పిటిషన్‌ను విచారించిన కోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోర్టు వివరణ కోరింది. 2013లో 150 అనుమతిలేని ప్రార్థనాలయాలను తొలగించామని ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం కౌంటర్‌లో నిజం లేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. కాగా, కౌంటర్ దాఖలు చెయ్యని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. హైకోర్టు సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement