కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి.
బోడుప్పల్: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. బోడుప్పల్ గ్రామానికి చెందిన 10 మంది అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌నేత నత్తి మైసయ్య కుమారుడు నత్తి అజయ్ కుమార్ (22), మైసగల్ల బాలయ్య, కామగల్ల వెంకటేశ్, సందీప్, నర్సింహ్మ, బాబ, అనిల్‌తోపాటు మరో ఇద్దరు కలిసి అయ్యప్ప మాల వేసుకుని క్వాలిస్‌లో శబరి మలై వెళ్లారు.
శబరిమలై నుంచి తిరిగి వస్తూ తిరుపతి వచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని సోమవారం బోడుప్పల్‌కు తిరిగి వస్తున్నారు. కోడూరు వద్దకు రాగానే మలుపు వద్ద ఉన్న కంటైనర్‌ను క్వాలిస్ ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నత్తి అజయ్‌కుమార్ అక్కడక్కడే మృతి చెందాడు. మిగతా 9 మందికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.