అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి | New ZP Chairmans Meet To KTR | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

Jun 10 2019 11:55 AM | Updated on Jun 10 2019 11:55 AM

New ZP Chairmans Meet To KTR - Sakshi

కేటీఆర్‌కు పుష్ఫగుచ్ఛం అందజేస్తున్న అనితారెడ్డి

మహేశ్వరం: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డికి సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో  కేటీఆర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జెడ్పీ పీఠం పార్టీ కైవసం చేసుకోవడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేసి అనితారెడ్డిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన పరిషత్‌ సభ్యులంతా గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపినట్లు అనితారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు తీగల హరినాథ్‌రెడ్డి, కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, కె.రాకేశ్‌రెడ్డి, లక్ష్మీనర్సింహరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement