ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
మహబూబ్‌నగర్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కుచ్చూరులో జరిగింది. ఈ ఘటనలో ఒక కుమారుడు శివకుమార్ (10) అక్కడికక్కడే మరణించగా, తల్లి, మరో కుమారుడు గణేశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(నవాబ్‌పేట్)