వ్యాపారి ఇంట్లో చోరీ | money stolen in businessman and case filed | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఇంట్లో చోరీ

Jul 19 2017 2:57 PM | Updated on Aug 30 2018 5:27 PM

వ్యాపారి ఇంట్లో చోరీ - Sakshi

వ్యాపారి ఇంట్లో చోరీ

వ్యాపారి ఇంట్లో ఎవరూలేని సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని మార్వాడీ బజార్‌లో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న ఓంప్రకాశ్‌ అనే వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఓం ప్రకాశ్‌ వరంగల్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి వచ్చిన వ్యాపారి ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది.

తాళం పగలగొట్టి ఇంట్లో దాచిన రూ.2.13 లక్షల నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. బాధిత యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల కోసం క్లూస్‌ టీం ప్రయత్నిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement