10న మంత్రివర్గం.. హరీష్‌, కేటీఆర్‌కు పదవులు డౌటే?

May KCR Announce Cabinet List On Tenth This Month Sources - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ వీడనుంది. మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 10న కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పదిమందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ యోచిస్తుండగా.. దీనిపై పలు ఆసక్తికరమైన విషాయాలు బయటకు వస్తున్నాయి. 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్‌కు, మాజీ మంత్రి హరీష్‌ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సీనియర్లకు మెండిచెయ్యి ఎదురైయ్యే అవకాశం ఉంది.  గత ప్రభుత్వంలో అమాత్యులుగా సేవలందించిన కొంతమంది సీనియర్లకు ఈసారి అవకాశం రాకపోవచ్చు. కొత్తవారిలో ఖమ్మం శాసన సభ్యుడు పువ్వాడ అజయ్, ఆరూరి రమేష్‌ ,బాల్కా సుమన్‌, నిరంజన్‌ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top