ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మందకృష్ణ | Manda Krishna Madiga Travels in RTC Bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మందకృష్ణ

Jan 16 2020 12:22 PM | Updated on Jan 16 2020 2:42 PM

Manda Krishna Madiga Travels in RTC Bus - Sakshi

సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బతకాలంటే ప్రతి ఒక్కరు సొంత వాహనాలను వదిలి ఆర్టీసీలో ప్రయాణించాలి. ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికులకు మద్దతు ఇచ్చినట్లుగానే ఆర్టీసీని బతికించేందుకు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నా. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. ఇక్కడ  ఎందుకు సాధ్యంకాదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ అని కోరారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న కేసీఆర్ మాటలు ఎక్కడా కార్యరూపం దాల్చలేదని తప్పుబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement