భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య | man suicide in khammam district | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

Dec 4 2015 1:10 PM | Updated on Aug 29 2018 8:38 PM

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బస్టాండ్ సెంటర్ దగ్గరలోని బావిలో మృతదేహం తేలడాన్ని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని వెలికితీశారు. స్థానికంగా ఉండే బట్టు రవి అనే వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు.
 
మూడు రోజుల క్రితమే రవి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. రవి భార్య కుటుంబ కలహాల నేపధ్యంలో మూడు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement