చదువుకోమన్నందుకు పెట్రోలు పోశాడు | Sakshi
Sakshi News home page

చదువుకోమన్నందుకు పెట్రోలు పోశాడు

Published Tue, Jun 6 2017 11:40 AM

man murder attempt on father in mancherial

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అఖిల్‌ అనే యువకుడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. అయితే అతను చదువు పట్టకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాడు. చదువుకొమ్మని సోమవారం రాత్రి గట్టిగా మందలించడంతో ఆగ్రహించిన యువకుడు తన తండ్రి రమేష్‌(44)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తొలుత బెల్లంపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement