టీవీ ఆన్ చేస్తుండగా.. | man dies due to electric shock on tv tuning | Sakshi
Sakshi News home page

టీవీ ఆన్ చేస్తుండగా..

Nov 1 2015 8:51 AM | Updated on Sep 5 2018 2:26 PM

టీవీ ఆన్ చేసే క్రమంలో విద్యుధ్ఘాతానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

నల్గొండ: టీవీ ఆన్ చేసే క్రమంలో విద్యుధ్ఘాతానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం  సూర్య నాయక్ తండాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

తండాకు చెందిన లూనావత్ రవీందర్(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఉదయం ఇంట్లో టీవీ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement