గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లక్ష్యం అదే: కేటీఆర్‌ | KTR inaugurates TIF-MSME Green Industrial Park at Dandumalkapur | Sakshi
Sakshi News home page

హరిత ఇండస్ట్రియల్‌ పార్క్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన

Nov 1 2019 2:39 PM | Updated on Nov 1 2019 2:45 PM

KTR inaugurates TIF-MSME Green Industrial Park at Dandumalkapur - Sakshi

సాక్షి, యాదాద్రి : తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన శుక్రవారం చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... పారిశ్రామిక విధానంలో టీఎస్‌ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన‍్నారు.  దండుమల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ తెలంగాణకే కాకుండా దేశానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు.  పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల మూలంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిం చేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు.  కాలుష్యరహితమైన ఆరెంజ్, గ్రీన్‌ కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఈ పార్క్‌లో ఏర్పాటు కానున్నాయని, రసాయనిక, బల్క్‌డ్రగ్స్‌ పరిశ్రమలకు అవకాశం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

వేలాది మందికి ఉపాధి అవకాశాలు
పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు కొనుగోలు చేసిన ఔత్సాహికులు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ఉత్పత్తులను ప్రారంభించాలి. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీల యాజమానులకు అగ్రిమెంట్‌లో నిబంధన విధించారు.  ఈ పారిశ్రామిక వాడ ద్వారా ప్రత్యక్షంగా 19వేలు, పరోక్షంగా మరో 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.  ఉద్యోగులకు టౌన్‌షిప్, రెస్టారెంట్లు, డార్మెటరీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.  ఇక్కడ ప్రత్యేకంగా ఐటీఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. వృత్తి నైపుణ్యంతో కూడిన కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులకు లబ్ధి చేకూరనుంది. విజయవాడ – హైదరాబాద్‌ జాతీయహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న ఈపార్క్‌కు.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ ప్రాజెక్టు స్వరూపం

  • ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు 442 ఎకరాల భూమి కేటాయించారు. మొత్తం 450 యూనిట్లు రానున్నాయి.
  • ఇందులో 40 యూనిట్లు మహిళలకు కేటాయించారు. రూ.1,553కోట్ల పెట్టుబడితో పార్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. 
  • యూనిట్‌ సైజు  450 మీటర్ల నుంచి 5 ఎకరాల వరకు నిర్ణయించారు.  
  • ప్లాట్లు పొందిన వ్యక్తులు రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించాల్సి ఉంటుంది.
  • లేనిపక్షంలో ప్లాట్లను తిరిగి స్వాధీనం 
  • పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,600కి గజం చొప్పున భూమి ధర నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్లాట్ల కేటాయింపులు
  • పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.250కోట్ల నిధులు కేటాయించారు. 
  • ప్లాట్లు పొందిన వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, సబ్సిడీ లభిస్తాయి.
  • చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయి.
  • ఎలక్ట్రికల్, డ్రిల్లింగ్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ఇంజనీరింగ్, డిఫెన్స్‌ అండ్‌ ఎయిరోస్పేస్‌ వంటి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

టీఎస్‌ఐపాస్‌తో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
టీఎస్‌ఐపాస్‌ –2014 నూతన పారిశ్రామిక విధా నం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్ర భుత్వం చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ ధరకు భూమి, ప న్నుల్లో రాయితీ, పెట్టుబడుల్లో రాయితీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్‌ ల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్ర మల శాఖ ప్రోత్సహిస్తోంది. టీఎస్‌ఐపాస్‌ ద్వా రా గడిచిన మూడేళ్లలో జిల్లాలో 482 చిన్న, సూ క్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. 2019 ఆగస్టు 31 వరకు  రూ.4,559 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఆయా పరిశ్రమల్లో 17,618మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు టీఫ్రైడ్, టీఐడియా ద్వారా 231మంది లబ్ధిదారులకు పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహక పథకాలను అందించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5.51కోట్లు మంజూరు చేసింది. పరిశ్రమలు స్థాపించే జనరల్‌ కేటగిరీ వ్యక్తులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీలకు 35 నుంచి 40శాతం, మహిళలకు అదనంగా 10 శాతం రాయితీ, పావలా వడ్డీ ఇస్తున్నారు.  

జిల్లాకు తరలిరానున్న మరో 300 పరిశ్రమలు
హైదరాబాద్‌ జంటనగరాలనుంచి పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌రోడ్డు బయటకు తరలించా లని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే మరో 300 వరకు పరిశ్రమలు జిల్లాకు రానున్నాయి. పరిశ్రమలు స్థాపించే వారికి సరసమైన ధరలకు భూముల కేటాయింపు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్‌విండో విధానంతో అనుమతులు జారీ చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement