ఆటవిడుపు కోసమో.. అహ్లాదం కోసమో ఎగిరేసిన గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది.
హైదరాబాద్: ఆటవిడుపు కోసమో.. అహ్లాదం కోసమో ఎగిరేసిన గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన చింతల్ సమీపంలోని మారుతీనగర్‌లో శుక్రవారం జరిగింది. భవానికళ్యాణ్ (9) గాంధీనగర్ లోని ఠాగూర్ హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తూ కాలు జారీ కిందపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బాలుడిని వెంటనే అంబులెన్స్ సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. భవానికళ్యాణ్ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతిచెందాడు.