స్వగృహంలో కేసీఆర్ పెళ్లిరోజు వేడుక | KCR wedding ceremony in home town | Sakshi
Sakshi News home page

స్వగృహంలో కేసీఆర్ పెళ్లిరోజు వేడుక

Apr 24 2015 1:28 AM | Updated on Aug 15 2018 8:06 PM

స్వగృహంలో కేసీఆర్ పెళ్లిరోజు వేడుక - Sakshi

స్వగృహంలో కేసీఆర్ పెళ్లిరోజు వేడుక

తమ పెళ్లి రోజును పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గురువారం బంజారాహిల్స్ నందినగర్‌లోని ...

హైదరాబాద్: తమ పెళ్లి రోజును పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గురువారం బంజారాహిల్స్ నందినగర్‌లోని తమ స్వగృహానికి వచ్చారు. ఉదయం 12 గంటలకు కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఇక్కడికి వచ్చి సాయంత్రం వరకు గడిపారు.

ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు విచ్చేశారు. పెళ్లి రోజు విందు భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. తన బంధుమిత్రులతో కేసీఆర్ ఈ వేడుకలను జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు ఆయనను కలిసి  శుభాకాంక్షలు తెలిపారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తన స్వగృహానికి రావడంతో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement