'పొన్నం.. ఓ మానసిక రోగి' | karne prabhakar takes on ponnam prabhakar | Sakshi
Sakshi News home page

'పొన్నం.. ఓ మానసిక రోగి'

Feb 23 2015 5:01 PM | Updated on Sep 2 2017 9:47 PM

మంత్రి జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపించాలని టీఆర్ఎస్ ఎంపీ కర్నె ప్రభాకర్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు సవాలు విసిరారు.

మంత్రి జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు సవాలు విసిరారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులలో 5 శాతం కమీషన్లంటూ పొన్నం ప్రభాకర్ తదితరులు తెలంగాణ విద్యాశాఖ మాజీమంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే అంశంపై సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన పొన్నం ప్రభాకర్ మానసిక రోగిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆరోపణలు రుజువుచేయకుంటే పొన్నంపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement