'విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు'

 kadiyam srihari on engineering colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ కాలేజీలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెకేట్‌ పిటిషన్‌ వేసినట్టు ఆయన చెప్పారు.

ఈ అంశంపై అప్పీల్‌ కు వెళ్లడం గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాలేజీలు ఫీజులు పెంచాలంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే పెంచాలన్నారు. ఇప్పుడున్న రూ. లక్షా 13 వేల ఫీజును రూ. 2 లక్షలకు పెంచితే విద్యార్థులకు భారమవుతుందన్నారు. ఫీజుల పెంపుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కాలేజీలను కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top