ట్రాక్టర్‌ బోల్తాపడి విద్యార్థి మృతి | ITI student killed in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తాపడి విద్యార్థి మృతి

Jul 6 2016 12:45 PM | Updated on Sep 4 2017 4:16 AM

పొలం దున్నేందుకు వెళ్ళిన ఐటీఐ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా లో జరిగింది.

టేకులపల్లి : పొలం దున్నేందుకు వెళ్ళిన ఐటీఐ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా లో జరిగింది. టేకులపల్లి మండల పరిధిలోని రాజుతండాలో జరిగింది. కొత్తగూడెం మండలం కారుకొండ రామారానికి చెందిన గుండ్ల రంజిత్‌ కుమార్‌ (19) ఐటీఐ చదువుతున్నాడు. బుధవారం ఉదయం తన పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. మండల పరిధిలోని రాజుతండా సమీపంలో వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌తో సహా రంజిత్ లోయలో పడిపోయాడు. తీవ్ర గాయాలైన రంజిత్ అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement