సర్పంచ్‌ అయినా.. కుల వృత్తి వీడలే..

Ideal Sarpanch In Adilabad - Sakshi

సాక్షి, కోటపల్లి(చెన్నూర్‌): ఏదైనా పదవి రాగానే కులవృత్తిని పక్కనబెట్టివారిని చూస్తున్నాం.. పదవి పోగానే అయిష్టంగానైనా.. మళ్లీ తమ వృత్తిని కొనసాగించేవారిని చూశాం. కానీ.. ఈయన మాత్రం ఓ గ్రామానికి సర్పంచ్‌ అయినా కులవృత్తిపై మాత్రం మమకారం వీడలేదు. ఉదయాన్నే లేవగానే ఎప్పటిలాగే ప్రజలకు క్షౌ వరం.. షేవింగ్‌ చేస్తున్నాడు. ఎలాంటి మొహమాటం లేకుండా తన పనిని సాఫీగా చేసుకుంటూపోతున్నాడు కోటపల్లి మండలం లింగన్నపేట పంచాయతీ సర్పంచ్‌ దాగామ రాజు. రాజు ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎల తన కులవృత్తి చేసుకున్నారో.. ఇప్పుడూ అలాగే తన కులవృత్తిని వదలకుండా గ్రామంలోని చిన్నాపెద్దా తేడా లేకుండా క్షౌవరాలు చేస్తున్నాడు. రాజును చూసి ప్రజలు ‘ఆదర్శంగా నిలుస్తున్నారు..’ అంటూ కితాబునిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top