
సాక్షి, హైదరాబాద్: ‘సీఎంగా కేసీఆర్‌కు నా అవసరం ఉండదు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా నాకూ, మా ప్రజలకు ఆయనతో అవసరం ఉంటుంది. వ్యక్తిగత పనులేమీ అడగను. ప్రజలూ, నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కలుస్తాను. అవకాశం ఇవ్వకపోతే మళ్లీ ప్రయత్నిస్తాను. నాలుగేళ్ల వరకు ఇలాగే చేస్తాను’అని జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తనకు తెలుసునని, తన వ్యూహం తనకు ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌ను తిట్టడం మాని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.