24 గంటల్లో ఇళ్లపట్టాలు: కేసీఆర్ | house plots to be given in 24 hours, says kcr | Sakshi
Sakshi News home page

24 గంటల్లో ఇళ్లపట్టాలు: కేసీఆర్

Jan 9 2015 2:04 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయాలకు అతీతంగా పేదల అభివృద్ధికి పాటుపడతానన్నారు.

వరంగల్:  దీన్‌దయాళ్‌నగర్‌లోని మురికివాడలలోని పేదలందరికీ అధికారులతో సర్వే చేయించి 24గంటల్లో ఇళ్లపట్టాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్‌ దీన్‌దయాళ్‌నగర్‌లోని మురికివాడలను పరిశీలించి, అక్కడి ప్రజలతో స్థానిక సమస్యలపై చర్చించారు.

మురికివాడలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అలాగే రేషన్‌కార్డు, పెన్షన్‌ లబ్ధిదారులను కూడా గుర్తిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement