
‘ఎవరూ తాగి వాహనాలు నడపొద్దని’ ఏంజెల్ సినిమా హీరో, హీరోయిన్ నాగఅన్వేష్, హెబ్బాపటేల్ సూచించారు. గచ్చిబౌలిలోని ‘ది టిల్ట్’ బార్‌లో ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’పై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. మందు తాగే చోటే, దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. బార్ డైరెక్టర్ విజయ్‌పట్వారీ పాల్గొన్నారు.