పట్టు పరిశ్రమకు ‘ఉపాధి హామీ’ అనుసంధానం

Harish Rao Speaks Over Employment Scheme - Sakshi

మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి si

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పట్టుకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, పట్టు పరిశ్రమను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగం గానే పట్టు రైతులు నిర్మించే షెడ్‌లకోసం సహకరించేందుకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌ యార్డులో జరిగిన పట్టు రైతు సమ్మేళనంలో మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ త్వరలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రితో సమావేశమై ఉపాధిహామీ పథకం అనుసంధానంపై చర్చిస్తామని తెలిపారు. పట్టు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి పట్టు సాగులో యువతను భాగస్వాములను చేసేందుకే సిద్దిపేటలో సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతకుముందు మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో సంప్రదాయ పంటలకు సాంకేతికతను జోడించి దానిని స్ఫూర్తిగా కొనసాగించే ప్రయత్నంలో రైతు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మేళనంలో వివిధ జిల్లాల పట్టు రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top