
నీళ్లు లేని చెరువులో నిమజ్జనం
నీళ్లు లేని చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెలో శనివారం చోటుచేసుకుంది.
నిజామాబాద్ (మాచారెడ్డి) : నీళ్లు లేని చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఏడాది నిజామాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉండటంతో నీళ్లతో కళకళలాడాల్సిన చెరువులు బోసిపోయి ఉన్నాయి. నిమజ్జనం చేసే సమయం ఆసన్నమవటంతో చేసేదేమీ లేక గ్రామస్తులు వినాయకుడి ప్రతిమలను నీళ్లు లేని చెరువులో అలాగే వదిలేశారు.