ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ | Free Central Armed Police Forces Training In Joint Khammam Districts | Sakshi
Sakshi News home page

ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Dec 21 2019 9:32 AM | Updated on Dec 21 2019 9:32 AM

Free Central Armed Police Forces Training In Joint Khammam Districts - Sakshi

సాక్షి, ఖమ్మం: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్మీ, పారా మిలిటరీ(సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌)ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదివిన యువకులు 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 167 సెం.మీ. ఎత్తు, 77 సెం.మీ. చాతి ఉన్న యువకులకు కైరోస్‌ కాంపోజిట్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్‌ అకాడమీ ద్వారా హైదరాబాద్‌లో 45 రోజుల పాటు హాస్టల్‌ వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన ఉండి ఆసక్తి గల వారు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుతో ఈ నెల 24వ తేదీ లోపు బీసీ స్టడీసర్కిల్‌ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం 08742–227427, 9573859598 నంబర్లను సంప్రదించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement