రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల దుర్మరణం | Father and son killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల దుర్మరణం

May 29 2015 1:28 AM | Updated on Sep 2 2018 4:37 PM

నర్సాపూర్ రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కొడుకులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

నర్సాపూర్ రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కొడుకులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నర్సాపూర్ - హైదరాబాద్ రహదారిలోని అట వీ ప్రాంతంలో గల కసిల్లఫాం వద్ద గురువారం చోటుచేసుకుంది.
 
 ఎస్‌ఐ గోపీనాథ్ కథనం మేరకు.. జిన్నారం మండలం దోమడుగు గ్రామానికి చెందిన గొంది కృష్ణ (29), కార్తీక్ (2) భార్య రాణితో కలిసి నర్సాపూర్ మండలం నాగులపల్లిలో బంధువులు చనిపోవడంతో అంత్యక్రియలకు బైక్‌పై హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం నర్సాపూర్ అటవీ ప్రాంతం కసిల్లఫాం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
 
 ఈ ప్రమాదంలో కృష్ణ, అతడి కుమారుడు కార్తీక్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.  భార్య రాణికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను 108లో నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. తండ్రీ కుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement