విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | Farmer was killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

May 21 2018 1:20 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఇబ్రహీంపట్నం రూరల్‌: విద్యుత్‌ షాక్‌కు గురై రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కప్పపహాడ్‌ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నివాసం ఉంటున్న దేవరకొండ మైసయ్య, యాదమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుని జీవిస్తుంటారు. మైసయ్య శనివారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో పుంటికూర మడికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య యాదమ్మ, కుమారులతో కలసి వెతికినా జాడ తెలియరాలేదు.

ఫోన్‌ రింగ్‌ అవుతున్నా తీయడం లేదని గమనించిన మైసయ్య కుమారుడు రాత్రి సమయంలో బావి వద్దకు వెళ్లి చూశాడు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం యాదమ్మ పొలం వద్దకు వెళ్లి చూసేసరికి మైసయ్య శవమై కనిపించాడు. అడవి పందులు పంటను పాడు చేస్తున్నాయని విద్యుత్‌ షాక్‌ పెట్టడంతో అవే తీగలు మైసయ్యకు తాకి మరణించినట్లు గుర్తించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. మైసయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement