సాగు భారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నల్లగొండ జిల్లాలో ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు.
చివ్వెంల: సాగు భారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నల్లగొండ జిల్లాలో ఒక రైతు ప్రాణాలు తీసుకున్నాడు. చివ్వెంల మండలం లక్ష్మా తండా శివారు జాలుతండాకు చెందిన ధరావత్ శంకర్(40)కు మూడెకరాల భూమి ఉంది. దానిలో పత్తి, వరి సాగు చేశాడు. ఈ ఏడాది పత్తి ఆశాజనకంగా లేదు. గత ఏడాది మూడెకరాలు కౌలుకు తీసుకుని, సాగు చేయగా రూ.లక్ష అప్పు అయింది. కూతురి పెళ్లికోసం మరో రెండు లక్షల మేర అప్పు చేశాడు. అప్పులు బాధతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్ సోమవారం ఉదయం చేనులోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.