అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide in khammam distirict | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Aug 10 2015 11:08 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ముదిగొండ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కానాపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన రాజయ్య(45) తనకున్న రెండెకరాల భూమిలో పత్తిసాగు చేశాడు. ఈ రోజు ఉదయం పత్తి చేనుకు మందు కొట్టడానికి వెళ్లిన రాజయ్య అదే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ పెరగడంతో పాటు పత్తి చేనుకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాదనే బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement