108లో పరీక్ష... | Exam in the 108 | Sakshi
Sakshi News home page

108లో పరీక్ష...

Apr 2 2016 4:03 AM | Updated on Sep 3 2017 9:01 PM

108లో పరీక్ష...

108లో పరీక్ష...

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఎ.రుచిత లోబీపీతో కళ్లు తిరిగి పరీక్ష హాల్‌లో పడిపోయింది.

బీపీతో కళ్లు తిరిగిపడిపోయిన విద్యార్థిని
 
 జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఎ.రుచిత లోబీపీతో కళ్లు తిరిగి పరీక్ష హాల్‌లో పడిపోయింది. రామారావుపేటకు చెందిన రుచిత ఇందారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది.

శుక్రవారం సైన్స్-2 పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి పరీక్ష హాల్‌లో పడిపోయింది. దీంతో జైపూర్ 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది లక్ష్మయ్య, రమేశ్, కుందారం వైద్యాధికారి ఎస్.అనిత పరీక్ష కేంద్రానికి చేరుకుని రుచితకు వైద్యం అందించారు. 108 వాహనంలో గ్లూకోజ్ ఎక్కించారు. దీంతో రుచిత చివరి గంట పరీక్ష ఎంఈవో శ్రీనివాస్, పరీక్షల సీఎస్ సమక్షంలో 108 వాహనంలోనే రాసింది. పరీక్ష అనంతరం మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement